చెన్నై: ‘రాజకీయాల్లోకి ఎవరైనా రావొచ్చు. నటుడు రజనీకాంత్ పార్టీ పెట్టిన తర్వాత దీనిపై పూర్తిస్థాయిలో మాట్లాడతాన’ని డీఎంకే పార్టీ అధినేత ఎంకే స్టాలిన్ పేర్కొన్నారు. సోమవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. ‘అసలు రజనీకాంత్ ను పార్టీని ప్రకటించనివ్వండి. ఆయన సిద్ధాంతాలేంటో తెలుసుకుని అప్పుడు స్పందిస్తాను. రాజకీయ సలహాదారుగా తమిళరువి మణియన్ ను నియమించుకోవడంపై రజనీకాంత్ చింతిస్తున్నట్టు తెలిసింద’ని వ్యాఖ్యానించారు. తమిళరువిని ఎందుకు తెచ్చిపెట్టుకున్నానాని రజనీకాంత్ పునరాలోచనలో పడ్డారని తెలిపింది. పార్టీ ఏర్పాటు మొట్టమొదటి నియామకం ఇదే.