మతోన్మాదుల నుంచి విద్యార్థుల్ని రక్షించండి

మతోన్మాదుల నుంచి విద్యార్థుల్ని రక్షించండి

చెన్నై : మతోన్మాదుల నుంచి విద్యార్థులు, అధ్యాపకుల్ని కాపాడేందుకు సీఆర్పీఎఫ్ బలగాల్ని ఉపయోగించాలని డీఎంకే అధ్యక్షుడు ఎం.కే. స్టాలిన్ సూచించారు. తనకు ఆ బలగాల భద్రతను ఉపసంహరించిన నేపథ్యంలో ఆ మేరకు వ్యాఖ్యానిం చారు. ‘కొన్ని సంవత్సరాలుగా నాకు రక్షణ కల్పించిన సీఆర్పీఎఫ్ పోలీసులకు ధన్యవాదాలు. మతపరంగా ఎవరైతే యూని వర్శిటీల్లో అల్లర్లను ప్రేరేపిస్తున్నారో వారి బారి నుంచి విద్యార్థులను, యూనివర్శిటీలను రక్షించడానికి ఆ భద్రతా బలగాలను వాడండ’ని కేంద్రానికి సూచిం చారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos