ముంబై: స్టాక్ మార్కెట్లు బుధ వారం నష్టాల పాలయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 51 పాయింట్లు నష్టపోయి 40,817 వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 27 పాయింట్లు నష్టపోయి 12,025 వద్ద నిలి చాయి.ఒక దశలో నిఫ్టీ 12 వేల కంటే తక్కువకు దిగజారింది. మదు పర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.71.79 వద్ద దాఖలైంది. భారతీ ఎయిర్టెల్, టీసీఎస్, యస్ బ్యాంకు, అల్ట్రాటెక్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు లాభాలు పొందాయి. ఐషర్ మోటర్స్, కోల్ ఇండియా, ఎల్ అండ్ టీ, ఇండియన్ ఆయిల్, ఓఎన్జీసీ షేర్లు నష్టాల పాలయ్యాయి.