భువనేశ్వర్: ఒడిశాలో ఏప్రిల్ 30వరకూ లాక్డౌన్ పొడిగించి ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ముందు చూపు ప్రదర్శించారు. వాస్తవానికి కరోనా కేసుల సంఖ్య తక్కువగానే ఉంది. 42 కేసులు నమోదు కాగా ఒకరు చనిపోయారు. అయినా లాక్డౌన్ పొడిగించడం ఒక్కటే పరిష్కారమని భావించిన ఆయన ప్రజలను ఇంటి నుంచి బయటకు రావద్దని సూచించారు. ముసుగుల వాడకం తప్పనిసరి చేశారు. పేదలకు మూడు నెలల రేషన్, నిత్యావసరాలు ముందుగానే అందించాలని అధికారులను ఆదేశించారు. జూన్ 17 వరకూ పాఠశాలలు, కళాశాలలతో పాటు విద్యాసంస్థలన్నింటినీ మూసి వేస్తారు. వేసవి సెలవులయ్యేవరకూ విద్యాసంస్థలు తెరవరాదని ఆదేశాలు జారీ చేశారు. వీలైనంత త్వరగా లక్షమందికి కరోనా పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు.