అజయ్‌ దేవగన్‌ అందుకే ఒప్పుకొన్నాడా?

  • In Film
  • March 19, 2019
  • 176 Views
అజయ్‌ దేవగన్‌ అందుకే ఒప్పుకొన్నాడా?

బ్రిటీష్ పాలనపై,నిజాం పాలనపై ఒకే సమయంలో తిరుగబాటు చేసిన అల్లూరి సీతారామరాజు,కొమురం భీంల జీవిత చరిత్రను స్పూర్తిగా తీసుకొని రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంపై ఊహాగానాలు కొనసాగుతూనే ఉన్నాయి.ఆర్‌ఆర్‌ఆర్‌పై ప్రసార మాధ్యమాలు,సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు,ఊహాగానాలతో విసుగు చెందిన రాజమౌళి హీరోలు తారక్‌,చరణ్‌ నిర్మాత దానయ్యలతో కలసి మీడియా సమావేశం పెట్టి మరీ హీరోల పాత్రలు,హీరోయిన్లు,కీలక పాత్రలు కథ, కథనం ఇలా అన్నింటిపై క్లారిటీ ఇచ్చారు.ఇది జరిగిన రెండు మూడు రోజుల నుంచి ఆర్‌ఆర్‌ఆర్‌పై మరొక విధంగా ఊహాగానాలు బయలుదేరాయి.ప్రస్తుతం అజయ్‌ దేవగన్‌ పాత్ర గురించి ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి.ప్రెస్‌మీట్‌ జరగడానికి కొద్ది రోజుల ముందు కూడా అజయ్‌ తాను ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంలో నటించడం లేదంటూ స్పష్టం చేఃశారు.అజయ్‌ వ్యాఖ్యలు చేసిన కొద్ది రోజులకే తమ చిత్రంలో అజయ్‌ దేవగన్‌ కీలకపాత్ర పోషిస్తున్నారంటూ దర్శకుడు రాజమౌళి స్వయంగా మీడియా సమావేశంలో ప్రకటించడంతో బాలీవుడ్‌ వర్గాలు,మీడియా వర్గాలు షాకయ్యాయి.అయితే అజయ్‌ను ఒప్పించడానికి రాజమౌళి పెద్ద కసరత్తే చేశారని టాక్‌.తనకు ఆఫర్‌ చేసిన ఉత్తర భారతదేశ స్వాతంత్య్ర సమరయోధుడి పాత్ర నిడివి తక్కువగా ఉండడంతో పాటు పాత్ర స్వరూపంపై అభ్యంతరం వ్యక్తం చేసిన అజయ్‌ పాత్ర చేయడానికి నిరాకరించాడట.అయితే ఈ పాత్రను అజయ్‌తోనే వేయించాలనే పట్టుదలతో రాజమౌళి పాత్ర నిడివి పెంచడంతో పాటు అజయ్‌ అడిగినంత పారితోషకం ఇవ్వడానికి కూడా అంగీకరించడంతో అజయ్‌ కూడా పాత్ర చేయడానికి అంగీకరించినట్లు సమాచారం..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos