శ్రీశైలం జలాశయం చరిత్రలో మొదటిసారి..

శ్రీశైలం జలాశయం చరిత్రలో మొదటిసారి..

ఇన్నేళ్ల చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా శ్రీశైలం జలాశయం సరికొత్త రికార్డు సృష్టించింది.శ్రీశైలం డ్యామ్ చరిత్రలో మొదటిసారి ఈ ఏడాది ఆరు సార్లు జలాశయం క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసినట్లు జలాశయం అధికారులు తెలుపుతున్నారు.ఎగువ రాష్ట్రాలతో పాటు రాయలసీమలో సైతం కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురవడంతో రోజుల వ్యవధిలో ఆరు సార్లు క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు.కృష్ణ,తుంగభద్ర నదులు ఉప్పొంగి ప్రవహించడంతో శ్రీశైలం జలాశయం పరిధిలోని అన్ని జలాశయాల్లో నీటిమట్టం పూర్తిస్థాయికి చేరుకోవడంతో జలాశయాలు నిండుకుండలను తలపిస్తున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వస్తుండడంతో మూడు క్రస్ట్ గేట్లను పది అడుగుల మేరఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం డ్యాం చరిత్రలోనే ఒకే సంవత్సరంలో ఆరు సార్లు డామ్ గేట్లను ఎత్తి దాఖలాలు లేవని అధికారులు తెలిపారు. డ్యామ్ చరిత్రలో తొలిసారిగా ఆరు సార్లు జలాశయం నుండి మూడు రేడియల్ క్రస్ట్ గేట్లను పది అడుగుల మేరకు ఎత్తివేసి 84,225 క్యూసెక్కుల వరదనీటిని కిందకు విడుదల చేసినట్లు తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos