చంద్రబాబుది సైంధవ పాత్ర

చంద్రబాబుది సైంధవ పాత్ర

అమరావతి: ఇళ్ల పట్టాల పంపిణీలో తెదేపా అధ్యక్షుడు చంద్రబాబుది సైంధవ పాత్ర అని గృహ నిర్మాణ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు వ్యాఖ్యానించారు. మంగళ వారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు.‘పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీని తెదేపా అడ్డుకుంటోంది. ఇళ్ల స్థలాల కోసం 60 వేల ఎకరాలు సిద్దం చేసాం. మొత్తం 30 లక్షల మంది పేద కుటుంబాలకు చంద్రబాబు అన్యాయం చేస్తున్నారు. దేవతలు యజ్ఞం చేస్తుంటే రాక్షసులు భగ్నం చేసే ప్రయత్నం చేస్తారన్న పద్దతిలో చంద్రబాబు, ఆయన మనుషులు ఈ కార్యక్రమాన్ని పదేపదే అడ్డుకుంటున్నారు. అయినా వారి ఆటలు సాగవు. వారు చరిత్ర హీనులు కాక తప్పదు. ప్రభుత్వ, ప్రైవేటు భూములు కలిపి 60వేల ఎకరాల సేకరణ ద్వారా అడుగు ముందుకు వేసాం. ఇళ్ల స్థలాలు వితరణకు సిద్ధంగా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు, ఆయన అనుయాయులు దీన్ని అడ్డుకునేందుకు న్యాయస్థానానికి వెళ్లారు. కొన్ని వందల వ్యాజ్యాలు దాఖలు చేయించారు. వీటిలో నాలుగు వ్యాజ్యాలకు ఉన్నత న్యాయస్థానం మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. దాని ప్రకారం రిజిస్ట్రేషన్ పట్టాలిచ్చేందుకు వీలుకాని పరిస్థితి ఏర్పడింది. సుప్రీంకోర్టు సెలవులు ఉన్నందున ఇప్పటికిప్పుడు ఆ స్టేను తొలగించే పరిస్థితి లేదన్నా’రు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos