అవకాశాల కోసం దిగజారా..అందుకే బోల్డ్‌గా తయారయ్యా..

  • In Film
  • March 16, 2019
  • 168 Views
అవకాశాల కోసం దిగజారా..అందుకే బోల్డ్‌గా తయారయ్యా..

తెలుగ చిత్ర
పరిశ్రమపై శ్రీరెడ్డి పెంచుకున్న కోపం ఇప్పట్లో తగ్లేలా కనిపించడం లేదు.తరచూ తెలుగు
చిత్ర పరిశ్రమపై విమర్శలు,ఆరోపణలు చేసే శ్రీరెడ్డి మరోసారి చిత్ర పరిశ్రమపై ఆగ్రహం
వ్యక్తం చేశారు.ఎన్నో కలలతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టానని ఎంతకీ అవకాశాలు
రాకపోవడంతో అవకాశాల కోసం దిగజారానని అయినప్పటికీ అవకాశాలు రాకపోవడంతో బోల్డ్‌గా మారానన్నారు.చిన్నతనంలో
ఎదుర్కొన్న ఇబ్బందులు,తెలుగు చిత్ర పరిశ్రమలు ఎదురైన అనుభవాలే తనను బోల్డ్‌గా మార్చేశాయన్నారు.పక్కలోకి
రాకపోతే అవకాశాలు రావని చెప్పడంతో ఇష్టం లేకపోయినా అవకాశాల కోసం చేయకూడని పనులు చేశానన్నారు.ఎవరు
కూడా పుట్టుకతోనే వ్యభిచారిగా పుట్టరని పరిస్థితులే అలా మార్చేస్తాయని చెప్పుకొచ్చింది.మీడియా
కూడా ఒక్కోసారి ఒక్కొక్క విధంగా చిత్రీకరించిందని ఒకసారి మంచిగా ఒకసారి చెడ్డగా చిత్రీకరించిందన్నారు.తెలుగు
చిత్ర పరిశ్రమ,తెలంగాణ ప్రభుత్వం నాపై నిషేధం విధించిందని విన్నానని నేనే టాలీవుడ్‌,తెలంగాణను
నిషేధించానన్నారు.తెలుగు చిత్ర పరిశ్రమలో స్థానిక అమ్మాయిలకు ప్రాధాన్యత ఇవ్వరని అదే
తమిళ చిత్ర పరిశ్రమలో ప్రతిభ ఉంటే ఎవరికైనా అవకాశాలు ఇస్తారని తెలిపింది.మీటూ తరువాత
రూ.5 కోట్లు తీసుకొని తమిళ చిత్ర పరిశ్రమ వైపు వెళ్లానంటూ ఆరోపిస్తున్నారని కానీ అందులో
వాస్తవం లేదని కావాలంటే నా బ్యాంకు ఖాతా పరిశీలించుకోవచ్చని అందులో లక్ష రూపాయలు కూడా
లేవని తెలిపింది..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos