మై ఛానల్ నా ఇష్టం పేరుతో యూట్యూబ్‌లో ఛానెల్ తెరచి తన తమ్ముడు పవన్‌కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీకి మద్దతుగా జనసేనపై విమర్శలు చేసే ప్రత్యర్థి పార్టీలపై మెగాబ్రదర్ నాగబాబు తరచూ వీడియోలు పోస్ట్ చేస్తున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో తెదేపా మహిళ నేత సాదినేని యామినిపై కూడా నాగబాబు విమర్శలు చేస్తూ వీడియో పోస్ట్ చేశారు.అయితే ఈ వీడియోపై సాదినేని స్పందించి ఉంటే పెద్ద విషయమేమి కాదుకానీ తనకు అసలు సంబంధం లేని శ్రీరెడ్డి వీడియోపై స్పందించింది. అందుకు సంబంధించి వీడియో విడుదల చేసిన శ్రీరెడ్డి నాగబాబును రాయలేని అసభ్య పదజాలాలతో దూషించింది.నాగబాబు మాత్రమే వీడియోలు చేస్తాడా – చిడతలు కొడతాడా నేను కూడా వాయిస్తాను – నేను కూడా వీడియోలు చేస్తాను అంటూ శ్రీరెడ్డి చెప్పుకొచ్చింది. టీడీపీ నాయకురాలు యామిని గారిని నాగబాబు విమర్శించడం ఆయన దిగజారుడుతనంకు నిదర్శనం అంటూ చెప్పుకొచ్చింది.నీచమైన ప్రవర్తన కలిగిన నువ్వు ఏ మొహం పెట్టుకొని రాజకీయాల గురించి మాట్లాడుతున్నావంటూ ప్రశ్నించింది. జనసేన పార్టీ సభ్యుడిని కాను,జనసేన పార్టీలో లేనంటూనే జనసేనకు మద్దుతుగా ఎందుకు వీడియోలు పోస్ట్ చేస్తూ జనసేన భజన చేస్తున్నావంటూ ప్రశ్నించింది.60ఏళ్లు వయసున్న మీరు మీ కూతురు వయసున్న యామినిని విమర్శంచడం సబబేనా మీ కూతురిని ఎవరైనా ఇలానే అంటే మీరు చూస్తు ఊరికే ఉంటారా అంటూ ప్రశ్నించింది.ఒకప్పుడు మీ అమ్మగారిని కామెంట్ చేశారంటూ నీ జనాలతో రాళ్లతో కొట్టించావు కదా అప్పుడు మీడియా ముందుకు వచ్చి తెగ మాట్లాడావు కదా మరి ఇప్పుడు ఒక మహిళ అయిన యామిని గారిని ఎందుకు అలా విమర్శించావు. పోలీసు వ్యవస్థను రౌడీలు అంటూ ఎలా సంభోదిస్తావు అసలు నీకు ఏపీ రాజకీయాలతో ఏం సంబంధం ఉందని మాట్లాడుతున్నావు అంటూ శ్రీరెడ్డి వ్యాఖ్యలు చేసింది.