తన తమ్ముడు పవన్‌కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీకి మద్దతుగా అధికార,ప్రతిపక్షాలపై మెగాబ్రదర్ తరచూ యూట్యూబ్‌లో పోస్ట్ చేస్తున్న వీడియోలకు అధికార,ప్రతిపక్షాల నేతలు,కార్యకర్తల నుంచి స్పందన లేకపోయినా శ్రీరెడ్డి మాత్రం తరచూ నాగబాబుకు వ్యతిరేకంగా వీడియోలు పోస్ట్ చేస్తోంది.తాజాగా చంద్రబాబుకు రాజకీయాల నుంచి విరమణ కల్పిస్తామంటూ నాగబాబు చేసిన వీడియోపై శ్రీరెడ్డి బదులిచ్చింది.చంద్రబాబుగారు రాజకీయాల నుంచి తప్పుకుంటే అంత అనుభవం ఉన్న నాయకుడు రాజకీయాల్లో ఎవరు ఉన్నారు నాగబాబు అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు విరమణ పొందితే మీ తమ్ముడు సీఎం అవుతాడా సీఎం అయ్యి ఏం పొడుస్తాడు.రాష్ట్రంలో ఉన్న కన్నెపిల్లలందరినీ పెళ్లి చేసుకుంటాడా అంటూ వ్యంగ్యంగా ప్రశ్నించారు.గతంలో కాంగ్రెస్ నుంచి అందిన మూటలతో రాష్ట్రంలో కంపెనీలు పెట్టుకొని మీ ఇష్టప్రకారం రాక్షసరాజ్యాన్ని ఏర్పాటు చేస్తారా అంటూ ప్రశ్నించింది. అసలు చంద్రబాబు వయసుతో మీకేంటి పనంటూ ప్రశ్నించిన శ్రీరెడ్డి మీరు కూడా 60 ఏళ్లు వచ్చాయిగా మీ పిల్లలకు పెళ్లి సంబంధాలు చూసి పెళ్లి చేయకుండా జబర్దస్త్ వంటి ప్రోగ్రామ్స్‌లో ఎందుకు వెకిలి నవ్వులు నవ్వుతున్నారంటూ ప్రశ్నించింది.మీ కొడుక్కి మెగా స్టాంప్ ముద్ర ఉందిగా మరెందుకు వాళ్లకి,వీళ్లకి ఫోన్లు చేస్తూ అవకాశాలు ఇప్పిస్తున్నారు.70 ఏళ్లు వచ్చిన చంద్రబాబు రాజకీయాల నుంచి విరమణ పొందాలని అంటున్న మీరు దాదాపుగా అంతే వయసున్న మీ అన్న చిరంజీవి గురించి ఎందుకు మాట్లాడడం లేదు.మిగిలిన కుర్ర హీరోలతో పోటీ పడుతూ కూతుళ్ల కంటే తక్కువ వయసున్న హీరోయిన్లతో చిందులేస్తూ ఎందుకు సినిమాలు చేస్తున్నారు?వీటన్నింటి మీ దగ్గర సమాధానం ఉందా అంటూ ప్రశ్నించింది..