తిరుమల: మే 1 నుంచి శ్రీవారి మెట్టు మార్గాన్ని తెరవనున్నట్లు తితిదే సోమవారం ఇక్కడ ప్రకటించింది. నిరుడు నవంబర్ లో కురిసిన భారీ వర్షాలకు శ్రీ వారి మెట్టు మార్గం ధ్వంసమయింది. మరమ్మతులు ముగియటంతో శ్రీవారి మెట్టు మార్గం మళ్లీ తెరుచుకోనుందని టీటీడీ సభ్యుడు పోకల అశోక్ కుమార్ చెప్పారు. ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుని నిలబడేలా మరమ్మతులను పూర్తి చేసినట్టు వివరించారు.