కొద్దిరోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్న సీరియల్ నటి శ్రావణికి సంబంధించి ఓ కొత్త కోణం బయటకు వచ్చింది. ఆమెలో ఉన్న సేవా గుణాన్ని చాటే విషయం అది. లాక్ డౌన్ సమయంలో ఆహారం కోసం అల్లాడిన ఎంతో మంది బడుగు జీవులకు శ్రావణి సాయం చేశారు. రోడ్లపై దిక్కూ మొక్కూ లేని వారికి లాక్ డౌన్ సమయంలో శ్రావణి నీళ్ల సీసాలు, పండ్లు పంచి పెట్టారు. పలువురికి ఆహారం అందించి తన సేవా గుణాన్ని చాటిన ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో వలస కూలీలు, అనాథలకు ఆమె ఆహారం అందించారు. ఇందుకోసం ఆమె ఇంట్లో ఆహార పొట్లాలు, నీళ్ల సీసాలు సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది.