స్పుత్నిక్ వి’ ఇంపోర్టెడ్ ధర రూ.995

స్పుత్నిక్ వి’ ఇంపోర్టెడ్ ధర రూ.995

న్యూఢిల్లీ: డాక్టర్ రెడ్డీస్ -స్పుత్నిక్ వి టీకా (దిగుమతి) ఒక్కో మోతాదు ధర ఇండియాలో రూ.995.40కు లభ్యం కానుంది. స్థానికంగా సరఫరా దేశంలో మొదలైతే ధర తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి. దిగుమతి చేసుకుంటున్న స్పుత్నిక్ వి టీకాలు ఈ నెల 1న ఇండియాకు వచ్చింది. దీనికి కసౌలిలోని సెంట్రల్స్ డ్రగ్స్ లేబొరేటరీ ఈనెల 13న రెగ్యులేటరీ అనుమతిచ్చింది. భారతీయ ఉత్పత్తి భాగస్వాముల నుంచి కూడా సరఫరా మొదలవుతుంది. ‘దిగుమతి చేసుకున్న వ్యాక్సిన్ డోసు ధర గరిష్ట రిటైల్ ధర రూ.948 వరకూ ఉంటుంది. ఒక్కో డోసుకు 5 శాతం జీఎస్టీ అదనం’ అని డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos