విజయవాడ : గన్నవరం నుంచి రెండు నెలల పాటు విమాన సేవల్ని స్పైస్ జెట్ సంస్థ రద్దు చేసింది. 30 శాతం ప్రయాణికులు కూడా బుక్ కాక పోవటం ఇందుకు కారణ మని వెల్లడించింది. నష్టాలతో విమాన సర్వీసులను నడపలేమని తెలిపింది. ఆన్ లైన్ బుకింగ్స్ ను ఆపేసింది. విజయవాడ నుంచి బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, విశాఖపట్నం ప్రాంతాలకు వెళ్లే స్పైస్ జెట్ విమానాలు రద్దు కావడంతో గన్నవరం విమానాశ్రయం ఖాళీ అయింది. రెండేళ్ల కిందటి వరకూ స్పైస్ జెట్ విమానాల్లో 80 శాతానికి పైగా బుకింగులు ఉండేవి.