హైదరాబాద్ : సంక్రాంతి పండగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేకబస్సులు నడపాలని టీఎస్‌ఆర్టీసీ నిర్ణయించింది. హైదరాబాద్ నుంచి తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు 4,940 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు రంగారెడ్డి ఆర్‌ఎం వరప్రసాద్ తెలిపారు. ఎంజీబీఎస్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ జనవరి 10 నుంచి 13వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు.