దక్షిణ పెన్నా నీటికి కాలుష్యం కాటు…?

దక్షిణ పెన్నా నీటికి కాలుష్యం కాటు…?

హోసూరు : ఇక్కడికి  సమీపంలో ప్రవహిస్తున్న దక్షిణ పెన్నానది నీటిని తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన కాలుష్య నియంత్రణ మండలి అధికారులు పరీక్షల కోసం తీసుకెళ్లారు. అధికారుల బృందం దక్షిణ పెన్నా హోసూరు పరీవాహక ప్రాంతంలో సంచరించి, నీటి నమూనాలను సేకరించడంతో పెన్నా నీరు పూర్తిగా విషతుల్యమేనా అనే అనుమానం స్థానికుల్లో కలుగుతోంది. ఇటీవల కర్ణాటక ప్రాంతంలో వర్షాలు కాస్త ఎక్కువ కావడంతో దక్షిణ పెన్నా నదికి వరద నీటి ప్రవాహం ఎక్కువైంది. బెంగళూరు సమీపంలోని వర్తూరు, గుంజూరు తదితర ప్రాంతాలలో పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్యపు నీరు దక్షిణ పెన్నాలో కలవడంతో హోసూరు సమీపంలోని కెలవరపల్లి డ్యాం నీటిలో నురగ పేరుకుపోయింది. నీరు విషతుల్యం

కావడంతో నురగ ఎక్కువైందని మాధ్యమాలలో వార్తలు రావడంతో, దీనిపై స్పందించిన కేంద్ర గ్రీన్ ట్రిబ్యునల్ బోర్డు దక్షిణ పెన్నా నీటి నమూనాలను సేకరించి పరీక్షలకు పంపాలని ఇరు రాష్ట్రాల కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అందులో భాగంగా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన కాలుష్య నియంత్రణ బోర్డు అధికారుల బృందం హోసూరు సమీపంలో ప్రవహిస్తున్న దక్షిణ పెన్నా నది నీటిని సేకరించి అక్కడే పరీక్షలు నిర్వహించడమే కాకుండా నీటి నమూనాలను క్యాన్లలో తీసుకెళ్లింది. దక్షిణ పెన్నా నది ఇరు రాష్ట్రాలలో ప్రవహిస్తున్నందున ఎక్కడ నీరు కలుషితం అవుతున్నదో గుర్తిస్తామని అధికారులు తెలిపారు. అదేవిధంగా నీటిలో రసాయనాలు ఎంత మోతాదులో ఉన్నాయో పరీక్షించి గ్రీన్ ట్రిబ్యునల్‌కు నివేదిక సమర్పిస్తామని అధికారుల బృందం తెలిపింది. అకస్మాత్తుగా ఇరు రాష్ట్రాల అధికారులు దక్షిణ పెన్నా నది నీటిని పరీక్షలకు తీసుకెళ్లడంతో స్థానిక రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos