సోనూసూద్‌ ఆస్తి విలువ తెలుసా?

సోనూసూద్‌ ఆస్తి విలువ తెలుసా?

ముంబై: కరోనా పీడితులకు ఎంతో సాయం చేస్తున్న సోనూసూద్ ఆస్తి ఎంత? ఎంత ఆస్తి ఉంటే అంతలా సాయం చేస్తున్నాడనే ప్రశ్నలు చాలా మంది మదిలో మెదలు తున్నాయి. బాలీవుడ్ మీడియా సంస్థ అధ్యయనం ప్రకారం అతడి మొత్తం చర, స్థిర ఆస్తుల విలువ రూ. 130 కోట్లు. గత 20 ఏళ్లుగా సోనూ సూద్ సినిమాల ద్వారానే ఆ డబ్బును సంపాదించాడు. ఎక్కువ పారితోషికాన్ని తీసుకునే విలన్లలో ఒకడు. ముంబైలో హోటళ్లు ఆరంభించి వ్యాపారాన్ని కూడా చేసారు. ఇప్పటికే రూ. 10 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఇక ముందు కూడా ఎవరు సాయమన్న నేనుంటాను అంటున్నాడు సోనూసూద్. కరోనా పీడితుల్ని ఆదుకోవటంలో దేశానికి తలమానికమైన సూద్ 135 కోట్ల దేశ ప్రజల హృదయాల్ని కొల్లగొట్టి అపరిమిత రూ.కోట్లకు అధిపతయ్యాడంటే అతిశయోక్తి లేదు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos