కుమారి ఆంటీ ఫుడ్‌ స్టాల్‌లో సోనూసూద్‌ సందడి

కుమారి ఆంటీ ఫుడ్‌ స్టాల్‌లో సోనూసూద్‌ సందడి

హైదరాబాదు:ఇక్కడి కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్లో ప్రముఖ స్టార్ నటుడు సోనూసూద్ శుక్రవారం సందడి చేశారు. శుక్రవారం మధ్యాహ్నం ఐటీసీ కోహినూర్ పక్కన స్ట్రీట్ ఫుడ్ అమ్ముతున్న కుమారి ఆంటీ వద్దకు వెళ్లిన సోనూసూద్ అక్కడున్నవారందరినీ సర్ప్రైజ్ చేశారు. కుమారి ఆంటీని కలిసి శాలువాతో సత్కరించి బోకే ఇచ్చారు. అనంతరం ఆమెతో సరదాగా మాట్లాడారు. పంచ్లు వేస్తూ అక్కడున్న వారిని నవ్వించారు. ఫుడ్ సర్వ్ చేశారు. మహిళా సాధికారతకు కుమారీ ఆంటీ బెస్ట్ ఉదాహరణగా సోనూ సూద్ అభివర్ణించారు. భవిష్యత్తులో ఎలాంటి సాయం అవసరమైన చేస్తానని హామీ ఇచ్చారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos