న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తొలి రోజు ఉభయసభలనుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. రాజ్యసభ ఎంపీ, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ దీనిపై స్పందించారు. రాష్ట్రపతి ప్రసంగం పేలవంగా ఉందని వ్యాఖ్యానించారు. దీనిపై వివాదం చెలరేగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంపై స్పందించాలని సోనియా గాంధీని మీడియా ప్రతినిధులు అడిగారు. ‘తప్పుడు వాగ్దానాలు’ అని మెల్లగా ఆమె అన్నారు. ‘రాష్టప్రతి చివరి వరకు చాలా అలసిపోయారు. ఆమె మాట్లాడలేకపోయారు. పేలవంగా ఉంది’ అని వ్యాఖ్యానించారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేత అయిన రాహుల్ గాంధీ కూడా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంపై స్పందించారు. తన తల్లి వ్యాఖ్యలను ఆయన సమర్థించారు. ‘బోరింగ్? నో కామెంట్స్? అదే విషయాన్ని మళ్లీ మళ్లీ చెబుతున్నారా?’ అంటూ సోనియా గాంధీ మాటల భావాన్ని ప్రస్తావించారు.