న్యూ ఢిల్లీ : దేశంలో ప్రజాస్వామ్య విలువలను, రాజ్యాంగాన్ని కాపాడడానికి నిరంతరం పోరాడుతూనే ఉండాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. నూతన సాగు చట్టాల ద్వారా కేంద్రం సామాన్యుల హక్కులను కాలరాసిందని తీవ్రంగా మండిపడ్డారు. పార్టీ 136వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్క రించు కొని ఈ వీడియో విడుదల చేసారు.