అహ్మదాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ భద్రతను తాత్సారం చేసి తానే బాధితుడిగా నటిస్తున్నారని యూపీఏ అధినేత సోనియాగాంధీ వ్యాఖ్యానించారు. మంగళవారం ఇక్కడ జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. దేశ భద్రతతో మోదీ రాజీపడటం వల్ల ప్రజలే బాధితులయ్యారని, అయితే ఇందుకు భిన్నంగా తానే బాధితుడినంటూ చెప్పుకునే ప్రయత్నాలు చేస్తు న్నారని దుయ్యబట్టారు. ఉగ్రవాదులపై దాడులను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవాలని చూస్తు న్నారని ఆరోపించారు. కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, తూర్పు ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రా తదితరులు హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ చేసిన పనుల గురించి ప్రచారం సాగించాల్సిందిగా మన్మోహన్ సింగ్ ఈ సందర్భంగా పిలుపు నిచ్చారు. కేంద్ర ప్రభుత్వ తప్పుడు విధానాల వల్లే జాతీయ స్థూలోత్పత్తి తగ్గుముఖం పట్టిందని ఆరోపించారు. రాహుల్ గాంధీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, తూర్పు ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ,సీనియర్ నేతలు ఆంటోని, మల్లికార్జున ఖర్గే , అహ్మద్ పటేల్ తది తరులు హాజరయ్యారు.