అమరావతి : ‘చంద్రుడా రారా..
ఇంద్రుడై రారా ధీరా.. నీ పరిపాలన మాకు వరం..’ అనే తెలుగు దేశం పార్టీ ఎన్నికల ప్రచార గీతాన్ని
ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం ఇక్కడ విడుదల
చేసారు. వైజయంతి మూవీస్ సంస్థ ఈ గీతాన్ని రూపొందించింది. ‘మళ్లీ నువ్వే రావాలి’ అనే నినాదాన్ని
ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేలా తయారు చేసారు.
తెదేపా ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, అమరావతి, పోలవరం నిర్మాణాలను వివరించారు. ఈ పాట యూ ట్యూబ్‌లో
ఆప్‌లోడ్ చేయగానే మూడువేల మందికి పైగా వీక్షించారు.