మొబైల్లో వీడియో గేమ్లకు అలవాటు పడ్డ ఓ యువకుడు చేసిన పని వీడియోగేమ్లు పిల్లలపై,యువకులపై ఎంతగా దుష్ప్రభావం చూపుతున్నాయో కళ్లకు కట్టినట్లు చూపుతోంది.మొబైల్‌లో గేమ్‌లు ఆడుకోవడానికి రీచార్జ్ డబ్బులు ఇవ్వలేదని ఓ యువకుడు తండ్రిని ముక్కలుగా నరికిన ఘటన కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో వెలుగు చూసింది.బెళగావి నగరానికి చెందిన శంకరప్ప(59) మూడు నెలల క్రితం ఏఎస్ఐగా ఉద్యోగం నుంచి విరమణ పొందారు.అయితే మొబైల్లో హెచ్జీ గేమ్లకు బానిసైన శంకరప్ప తనయుడు రఘువీర్ కమ్మార్ ప్రతిరోజూ వీడియో గేమ్‌లు ఆడుకోవడమే పనిగా పెట్టుకున్నాడు.ఈ క్రమంలో ఆదివారం మొబైల్‌లోకరెన్సీ ఖాళీ కావడంతో తాను గేమ్ ఆడుకోవడానికి మొబైల్ రీచార్జ్ చేయించాలని తండ్రి శంకరప్పకు చెప్పాడు.దీంతో గేమ్‌లు మాని ఏదైనా పని చేసుకోవాలని తండ్రి శంకరప్ప కొడుకు రఘువీర్ కమ్మార్ కు బుద్దిమాటలు చెప్పాడు. మొబైల్ రీచార్జ్ చేసుకోవడానికి తండ్రి శంకరప్ప డబ్బులు ఇవ్వలేదని కొడుకు రఘువీర్ కమ్మార్ రగిలిపోయాడు.ఆదివారం రాత్రి తల్లిని గదిలో పెట్టి తాళం వేసిన రఘువీర్ నిద్రపోతున్న తండ్రి శంకరప్ప తలపై కొడవలితో నరికి దారుణంగా హత్య చేశాడు. తండ్రి శంకరప్ప తల, కాళ్లు, చేతులు, మొండెం ముక్కలు చేశాడు. తరువాత తండ్రి జోబులో ఉన్న డబ్బులు తీసుకుని మొబైల్ రీచార్జ్ చేసుకుని గేమ్స్ ఆడాడు. విషయం గుర్తించిన రఘువీర్ తల్లి గట్టిగా కేకలు వెయ్యడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మొబైల్ గేమ్స్ కు బానిస అయిన రఘువీర్ తండ్రి శంకరప్పను కిరాతకంగా హత్య చేసి, శరీరాన్ని ముక్కలు చేశాడు. పోలీసులు రఘువీర్ ను అరెస్టు చేశారు.మొబైల్ రీచార్జ్ చేసుకోవడానికి రూ. 200 ఇచ్చి ఉంటే శంకరప్ప బతికేవాడని ఆయన కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు.