కసాయి కొడుకు

కసాయి కొడుకు

రాయపూర్‌: క్షుద్రపూజల మైకం, నరబలి ఉన్మాదంతో ఓ కుమారుడు తన కన్నతల్లినే తెగనరికేశాడు. తీవ్రంగా గాయపడి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ మూలుగుతున్న ఆమె గాయాలనుంచి స్రవిస్తున్న రక్తాన్ని తాగేశాడు. ఈ దారుణం ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా జిల్లాలో డిసెంబరు 31న జరిగినప్పటికీ గురువారం(జనవరి 3వ తేదీ) రాత్రి వెలుగు చూసింది. కుమారుడి క్షుద్రపూజల పిచ్చికి బలైపోయిన సుమరియా(50) స్నేహితురాలు సమీరన్‌యాదవ్‌ ఈ దారుణాన్ని కళ్లారాచూసి కొయ్యబారిపోయింది. భయంతో వణికి పోయింది. పరుగున తన ఇంటికెళ్లిపోయింది. చివరకు గురువారం ఎలాగో ధైర్యాన్ని కూడగట్టుకుని జరిగిన విషయాన్ని తన ఇంట్లో చెప్పింది. గ్రామపెద్దల దృష్టికి తీసుకెళ్లింది. అంతా కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బిత్తర పోయిన పోలీసులు ఇంతటి దారుణానికి పాల్పడిన దిలీప్‌యాదవ్‌ కోసం వెతికారు. అతడు పరారీలో ఉన్నాడు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos