విజయవాడ: భాజపా అధ్యక్ష పదవి నుంచి కన్నా లక్ష్మీనారాయణను కావాలనే తప్పించి, ఆయన స్థానంలో తనను నియమించారనే ప్రచారంలో ఎలాంటి నిజం లేదని భాజపా నూతన అధ్యక్షుడు సోము వీర్రాజు మంగళవారం ఇక్కడ తెలిపారు. భాజపా వ్యక్తి ముఖ్యం కాదన్నారు. వైసీపీ ప్రభుత్వం చేపట్టిన ఇంటి స్థలాల కార్యక్రమంలో అనేక అక్రమాలు జరిగాయని ఆరోపించారు. వారి అవినీతిని ఎండగడతామని హెచ్చరించారు. ప్రభుత్వ భూములను అమ్మడాన్ని భాజపా బీజేపీ వ్యతిరేకిస్తోందని తెలిపారు.