కేసీఆర్ విశ్వాసపాత్రుడికి అదనపు బాధ్యతలు..

కేసీఆర్ విశ్వాసపాత్రుడికి అదనపు బాధ్యతలు..

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అత్యంత సన్నిహిత అధికారుల్లో ఒకరుగా గుర్తింపు ఉన్న సోమేశ్‌ కుమార్‌కు అదనపు బాధ్యతలు అప్పగించడానికి కేసీఆర్‌ నిర్ణయించుకున్నట్లు సమాచారం.ప్రస్తుతం సోమేష్ కుమార్  రెవిన్యూలోనే ఎక్సైజ్ కమర్షియల్ టాక్సెస్ సెక్షన్ బాధ్యతలు చూస్తున్న సోమేశ్‌ కుమార్‌కు కొత్త రెవిన్యూ చట్టం అమలు చేసే బాధ్యతను అప్పగించడానికి కేసీఆర్‌ నిర్ణయించుకున్నట్లు సమాచారం.గతంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఉన్న సోమేశ్‌ కుమార్‌ రూ. 5లకే భోజనం పథకం వంటి పలు పథకాలు ప్రారంభించి హైదరాబాద్‌ సీఎంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎక్సైజ్ కమర్షియల్ టాక్స్  శాఖ టార్గెట్లను చేరుకోవడంలో సోమేష్  కుమార్  అవలంభించిన విధానాలు ప్రశంసలు పొందాయి.ప్రభుత్వం జీఎస్టీని  అమలు చేసిన తర్వాత  రాష్ట్రానికి రెవిన్యూ తగ్గకుండా ఆయన కీలకంగా వ్యవహరించారు. అంతేకాదు దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న బకాయిలను కూడా సమర్థవంతంగా రాబట్టడంతో సోమేశ్‌కుమార్‌పై కేసీఆర్‌ ప్రత్యేక ఆసక్తి కనబరిచేవారు.ఈ నేపథ్యంలో రెవెన్యూశాఖలో అవినీతి రూపుమాపడానికి నిర్ణయించుకున్న కేసీఆర్‌ అందుకోసం సోమేశ్‌కుమార్‌ సరైన అధికారిగా భావించి కొత్త రెవిన్యూ చట్టం అమలు చేసే బాధ్యతను అప్పగించడానికి నిర్ణయించుకున్నట్లు సమాచారం.రెవిన్యూలో రిజిస్ట్రేషన్, స్టాంప్స్ విభాగం  స్పెషల్ చీఫ్ సెక్రటరీ  రాజేశ్వరీ తివారీని టీఆర్ఎస్ ప్రభుత్వం ఇటీవలనే బదిలీ చేయడం కూడా ఈ వార్తలకు మరింత బలం చేకూర్చుతోంది..

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos