ముంబై : స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాతో వ్యాపారాల్ని ఆరంభించాయి. ఉదయం 9:39 గంటలకు సెన్సెక్స్ 12 పాయింట్ల నష్టంతో 30,596 వద్ద, నిఫ్టీ 3 పాయింట్ల నష్టంతో 9,026 వద్ద ఉన్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.75.13 వద్ద ఆగింది. హిందాల్కో ఇండస్ట్రీస్, యూపీఎల్, టాటా మోటార్స్, కొటక్ మహీంద్రా బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, సిప్లా షేర్లు లాభాల్ని గడించాయి. మహీంద్రా అండ్ మహీంద్రా, టైటన్ కంపెనీ, బజాజ్ ఫిన్సర్వ్, అల్ట్రాటెక్ సిమెంట్, ఐటీసీ లిమిటెడ్, ఏషియన్ పెయింట్స్, గెయిల్ షేర్లు నష్టాల పాలయ్యాయి.