తెలుగు గూఢచారి ఫేమ్ శోభిత ధూళిపాళకు ఓ హోటల్‌లో చేదు అనుభవం ఎదురైందట.బుర్ఖా ధరించి వెళ్లిన తనకు హోటల్ గది తాళాలు ఇవ్వడానికి హోటల్ రిసెప్షనిస్ట్ నిరాకరించి అనుచితంగా ప్రవర్తించినట్లు శోభిత వాపోయారు.ఈ విషయాన్ని ఆమె తన సోషల్ మీడియా పేజీ ద్వారా వెల్లడించారు.ఓ చిత్రం షూటింగ్ కోసం బుర్ఖా ధరించిన అనంతరం షాట్ పూర్తయిన అనంతరం అదే దుస్తుల్లో తన కోసం కేటాయించిన హోటల్‌కు చేరుకున్నారు.అయితే హోటల్ రిసెప్షనిస్ట్ మాత్రం తనకు కేటాయించిన గది తాళాలు ఇవ్వడానికి నిరాకరించి తనతో అనుచితంగా ప్రవర్తించాడని ఆరోపించారు.నా బ్యాగ్, దుస్తలు దుమ్ముపట్టి ఉన్నాయి. బుర్ఖాలో నేను ముస్లింగా కనిపించడం వల్లే అతడు అలా ప్రవర్తించాడు. ఆ సంఘటనతో వెంటనే పక్కకు వెళ్లాను. చాలా బాధేసింది అంటూ తన అనుభవాన్ని శోభిత పంచుకున్నారు. బుర్ఖా తీసేసి నేను ఎవరో చెప్పేసి అతడితో క్షమాపణలు చెప్పంచగలను. కానీ నేను కావాలనే అలా చేయలేదు. అక్కడ ఉన్న పరిస్థితి చూసి నాకు చాలా భాదేసింది అని శోభిత ధూళిపాళ వాపోయారు. కొన్ని క్షణాలు అలాంటి పరిస్థితి ఎదుర్కొన్నపుడే నాకు ఎంతో బాధ అనిపించింది. సాధారణ ప్రజల వారి పరిస్థితి ఎలా ఉంటుందో అర్థమైంది. ఏది ఏమైనా ఇలాంటి ప్రవర్తన చాలా చాలా తప్పు.. అని శోభిత వ్యాఖ్యానించారు.అయితే ఇక్కడ ప్రతీ ఒక్కరూ గమనించాల్సిన విషయం ఏంటంటే శోభిత తాను చేసిన ఆరోపణల్లో కొన్ని లాజిక్‌లు మిస్సయ్యారు.తన(శోభిత) పేరుతో చిత్ర బృందం హోటల్‌లో గదిని బుక్ చేసారు.అలాంటపుడు శోభితాల కాకుండా తనను ఎవరు గుర్తు పట్టలేని విధంగా బుర్ఖా ధరించి హోటల్‌కు వెళ్లి గది తాళాలు అడిగితే ఎవరైనా ఎలా ఇస్తారు అనేది శోభిత మరచిపోయినట్లుంది.ఇంకా వివరంగా చెప్పాలంటే శోభితా అనే పేరుతో మీద రూమ్ బుక్ అయితే.. బురఖా వేసుకున్న ఎవరో ఒక అమ్మాయి వచ్చేసి.. రూం నెంబరు చెప్పి తాళాలు అడిగితే ఇచ్చేస్తారా? బుర్ఖా తొలగించి ఉంటే తనను హోటల్ సిబ్బంది గుర్తు పట్టేవాళ్లు వెంటనే గది తాళాలు ఇచ్చేవాళ్లు.ఇవ్వడమేమిటి స్వయంగా గది వరకు హోటల్ సిబ్బందే తీసుకెళ్లేవాళ్లు.ఇలా లాజిక్కులతో సంబంధం లేకుండా తనతో అలా ప్రవర్తించారు,ఇలా ప్రవర్తించారంటూ ఏవో రాతలు రాయడం ఎంత వరకు సమంజసమో సెలబ్రిటీలు ఆలోచించుకోవాలి..