విశాఖ : విశాఖలోని టౌన్ కొత్త రోడ్ లో ఉన్న విద్యుత్ ఆఫీసు ముందు సిపిఎం ఆధ్వర్యంలో ఎం.సుబ్బారావు నాయకత్వంతో ముఠా కార్మికుల యూనియన్ అధ్యక్షులు పైడిరాజుతో కలిసి వందలాదిమంది ముఠా కార్మికులు శుక్రవారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం జగదాంబ యూనియన్ కమిటీ కన్వీనర్ ఎం.సుబ్బారావు మాట్లాడుతూ …. స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా ప్రజల గొంతెత్తాలని, ఎందుకంటే స్మార్ట్ మీటర్లు పెట్టిన వెంటనే అద్వానీ ఆధీనంలోకి వెళ్ళిపోతుందని అన్నారు. అదానీ పెట్టిన ఆంక్షలతోనే ప్రజలు విద్యుత్తును వాడవలసి వస్తుందని, ఇది ఇప్పుడు ఉన్న విద్యుత్ బిల్లు కన్నా చాలా ఎక్కువ మొత్తంలో భారాలుగా ప్రజలపై పడతాయని వివరించారు. దేశభక్తిపరులు ఎవరైనా సరే ఈ విద్యుత్తు మీటర్లను వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జగదాంబజవన్, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, నాయకులు ఈశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.