25 నుంచి స్మార్ట్‌ రేషన్​ కార్డుల పంపిణీ

25 నుంచి  స్మార్ట్‌ రేషన్​ కార్డుల పంపిణీ

అమరావతి: స్మార్ట్‌ రేషన్‌ కార్డులు వచ్చే సోమ వారం నుంచి పంపిణీ చేయనున్నారు. కార్డుల్ని జిల్లా కేంద్రాలకు, అక్కడ నుంచి మండల కేంద్రాలకు తరలిస్తున్నారు. శుక్రవారం   కార్డులు అన్నీ మండలాలకు చేరనున్నాయి. సిబ్బంది ద్వారా నేరుగా కార్డు దారులకు పంపిణీ చేస్తారు. ప్రాధాన్యం మేరకు కొన్నిచోట్ల ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి ప్రజా ప్రతినిధులు, అధికారులు, నాయకులు కార్డుల పంపిణీని ప్రారంభించే వీలుంది.  త్వరలో స్మార్ట్‌ ఈ-పోస్‌ మిషన్లను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానుంది. ఇప్పుడిస్తున్న స్మార్ట్‌ కార్డులను ఈ యంత్రం ద్వారా స్వైప్‌ చేస్తే కార్డుదారుడి వివరాలు వస్తాయి. దీంతో గతంలో యంత్రాలతో వచ్చిన సర్వర్‌ సమస్యలు ఇకమీద ఉండవు. సిమ్, వైఫై, హాట్‌స్పాట్, బ్లూ టూత్, టచ్‌ స్క్రీన్‌ వంటి ఆధునిక సదుపాయాలతో, ఆండ్రాయిడ్‌ సాంకేతికతతో ఈ నూతన వ్యవస్థ పని చేస్తుంది. ఒకవేళ వేలిముద్ర పడకున్నా యంత్రంలో కెమెరా ద్వారా  కంటి పాపతో స్కాన్‌ చేయవచ్చు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos