పరిశ్రమలకూ విస్తరించిన మందగమనం

  • In Money
  • October 11, 2019
  • 173 Views
పరిశ్రమలకూ విస్తరించిన మందగమనం

ఢిల్లీ : ఆర్థిక మందగమనం దేశ ఆర్థిక వ్యవస్థను ఆందోళనలో పడవేస్తుండగా తాజాగా ఆగస్టులో పారిశ్రామిక ఉత్పత్తి భారీగా పడిపోయిందని ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. తయారీ, విద్యుత్ ఉత్పత్తి, మైనింగ్ సహా పలు రంగాల్లో వృద్ధి మందకొడిగా ఉండటంతో ఆగస్టులో పారిశ్రామిక ఉత్పత్తి 1.1 శాతం తగ్గిందని ఈ గణాంకాలు తెలిపాయి. గత ఏడాది ఆగస్టులో పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) 4.8 శాతం మేర పెరిగింది. గత ఏడాది ఇదే నెలలో విద్యుత్ ఉత్పత్తి 7.6 శాతం పెరగ్గా తాజాగా విద్యుత్ ఉత్పత్తి 0.9 శాతం పడిపోయింది. మైనింగ్ రంగం కేవలం 0.1 శాతం వృద్ధి నమోదు చేసింది. ఇక ఐఐపీలో 77 శాతం వాటా ఉండే తయారీ రంగం ఈ ఏడాది ఆగస్టులో 1.2 శాతం మేర కుదేలైంది. ఈ కీలక రంగం గత ఏడాది ఇదే నెలలో 5.2 శాతం వృద్ధి కనబరచడం గమనార్హం. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి రేటు గత ఏడాది ఆగస్టులో 5.3 శాతం నుంచి ఈ ఏడాది ఆగస్టులో 2.4 శాతానికి పరిమితమైంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఐఐపీ వృద్ధి గణాంకాలను సోమవారం వెల్లడించనున్నట్టు గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ తెలిపింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos