అమరావతి: రాష్ట్రంలోని మొత్తం 10,641 గ్రామాల్లో ఈనెల 30 నుంచి వ్యవసాయ కియోస్కులు ఏర్పాటు కానున్నాయి. ఇవి రైతులకు విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, పశువుల దాణా, అక్వాఫీడ్, మార్కెట్, పంటల సాగు తాజా సమాచారాన్ని అందిస్తుంది. కియోస్క్ తెరను రైతు వేలితో తాకి ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి లాగిన్ కావాలి. వివిధ కంపెనీలకు సంబంధించిన పంటల విత్తనాలు, పురుగు మందులు, ఎరువులు, పశువుల దాణా తదితరాల ధరవరలు తెరపై ప్రత్యక్ష మౌతాయి. రైతులు తమకు కావాల్సిన వాటిపై క్లిక్ చేస్తే ఆర్డర్ ప్రింట్ వస్తుంది. రెండు నుంచి మూడు రోజుల్లో మార్కెటింగ్ శాఖ అధికారులు రైతుల ఇళ్ల వద్దకు తెచ్చి వాటిని ఇస్తారు. విత్తనాలను ఎపి సీడ్స్, మిగతా వాటిని ఆగ్రోస్ సెంటర్లు సరఫరా చేస్తాయి.