ఆరేళ్ల ప్రాయంలోనే అద్భుత ప్రతిభ

ఆరేళ్ల ప్రాయంలోనే అద్భుత ప్రతిభ

హోసూరు : హొసూరులో ఆరేళ్ల బాలిక అన్ని విద్యలలో ఆరితేరి స్థానికులను ఆకట్టుకుంటోంది. హోసూరు సమీపంలోని సూలగిరికి చెందిన పవిత్ రామన్ కూతురు శ్వేతశ్రీ చదువులలోనే కాదు ఆటలలోను మొదటి స్థానంలో నిలుస్తూ వస్తోంది. ఈ చిచ్చర పిడుగు కర్రసాము, కరాటే, యోగాలో ప్రత్యేక మైన ప్రతిభను
కనబరుస్తున్నది. జూనియర్ కర్ర సాము పోటీలలో ప్రపంచ రికార్డు సాధించింది. కరాటే పోటీలలో పలు చోట్ల నెగ్గింది. ప్రస్తుతం యోగాలో అందరి మన్నలను అందుకుంటోంది. అతి చిన్న వయసులో అన్ని విద్యలలో ఆరితేరిన శ్వేతశ్రీ ప్రతిభను గుర్తించిన పలువురు పారితోషికాలు ఇస్తూ సన్మానాలు చేస్తున్నారు. ఈ చిచ్చర పిడుగు మరింతగా పేరు ప్రతిష్టలు సంపాదించుకోవాలని ఆశిద్దాం.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos