ముంబయి: బాలాకోట్‌లో జైష్ ఎ మహ్మద్ ఉగ్ర స్థావరంపై భారత వాయుసేన జరిపిన దాడిలో మృతి చెందిన ఉగ్రవాదుల సంఖ్యను తెలుసుకునే హక్కు దేశ ప్రజలకు ఉందని శివసేన మంగళవారం అభిప్రాయపడింది. ఆ సంఖ్యను బహిర్గతం చేయడం వల్ల భద్రతా బలగాల సామర్థ్యాన్ని, నైతిక స్థైర్యాన్ని తగ్గించినట్లు కాదని శివసేన అధికారిక పత్రిక – సామ్నాలో పేర్కొంది. హతమైన ఉగ్రవాదుల సంఖ్యను బహిర్గతం చేయాలన్న డిమాండ్ కేవలం ప్రతిపక్షాలది మాత్రమే కాదు ప్రపంచ మీడియాది కూడా అని వివరించింది.