నాగ్పూర్: మాంసాహారం చక్కటి పోషకాహారమని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆవరణలోనే హెచ్సీఎల్ సంస్థ అధినేత శివ నాడార్ మంగళవారం తేల్చి చెప్పారు. ఇక్కడ జరిగిన దసరా ఉత్సవాల్లో పాల్గొని ప్రసంగించారు. ‘మీకు నచ్చకపోయినా.. ఓ విషయం చెప్పదలు చుకున్నా. ఉత్తర ప్రదేశ్లో పోషకాహారం లోపంతో బాధపడుతున్న పిల్లల కోసం ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో నా కూతురు రోష్ని నాడార్ పాల్గొంది. ది. పిల్లలతో కోడి మాంసాన్ని తిని పించింది. పోషకాహార లోపాన్ని నివారించడంలో సఫలమైంది. ఇలా ప్రతి ఒక్కరూ తమ వంతు పాత్ర పోషిస్తేనే మార్పు వస్తుంది. ప్రభు త్వమే అన్ని పనులు చేయాలి, దేశంలో మార్పు రావాలనుకోవడం అవివేకం. ప్రైవేట్ సంస్థలు, పారిశ్రామిక వేత్తలు, వ్యాపారులు, ప్రభుత్వేతర సంస్థలు కష్టపడి పని చేస్తేనే దేశం బాగు పడు తుంద’న్నారు.