శివసేన నిజాయితీకి చిరునామా

శివసేన నిజాయితీకి చిరునామా

ముంబై: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు ప్రత్యామ్నాయ మార్గాలు కూడా ఉన్నాయని శివసేన నేత సంజయ్ రౌత్ మంగళ వారం మాధ్యమ సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ‘మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేసే విషయంలో శివసేనకు ఇతర మార్గాలు కూడా ఉన్నాయని మా పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే చెప్పారు. కానీ ఆ పాపాన్ని చేయబోం. శివసేన ఎల్లప్పుడూ సత్యంతో కూడిన నిజాయితీ రాజకీయాలనే చేస్తుంది. మాకు అధికార దాహం లేద’న్నారు. ‘మహారాష్ట్రలో దుష్యంత్ (హర్యానా నేత) వంటి వ్యక్తులు లేరు. అక్కడ ఆయన తండ్రి చెరసాల శిక్ష అనుభవిస్తున్నారు. ఇక్కడ ధర్మం, సత్యం ఆధారంగా రాజకీయాలు చేస్తాం. ఎన్సీపీ అధినేత శదర్ పవార్ రాష్ట్రంలో భాజపా, కాంగ్రెస్ కి వ్యతిరేకంగా వాతావరణాన్ని సృష్టించారు. ఆయన భాజపాతో ఎన్నడూ కలవబోర’ని వ్యాఖ్యానించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos