ఖమ్మం: కరోనా వల్ల భద్రాచలంలో నిర్వహించే సీతారాముల కల్యాణం ఈ సారి నిరాడంబరంగా జరగనుందని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ మంగళవారం ఇక్కడ విలేఖరులకు తెలిపారు. ముందు జాగ్రత్త చర్యగా శ్రీరామ నవమి వేడుకలు ఆలయ ప్రాంగణంలోనే నిర్వహిస్తామని తెలిపారు. ఏప్రిల్ 2న జరిగే సీతా రాముల కల్యాణ మహోత్సవం భక్తులు లేకుండానే జరుగుతుందని వెల్లడించారు.