రుణాల ఎగవేత దారుల పేర్లను బహిర్గతం చేయాలి

న్యూ ఢిల్లీ: బ్యాంకు రుణాల ఎగవేత దారుల పేర్లను మోడీ ప్రభుత్వం ఎందుకు బయట పెట్టడం లేదని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రశ్నించారు. ఎగవేతదారుల నుంచి భాజపాకు అధిక మొత్తంలో నిధులు అందుతున్నాయని విమర్శించారు. ప్రజల ప్రభుత్వాలను కూల్చేందుకు, ఎమ్మెల్యేలను సంతలో సరుకుగా కొనటం దారుణమన్నారు. ఇలా ప్రజాస్వామ్యాన్ని వ్యాపారం చేస్తే, భవిష్యత్ తరాలకు ఏమి అందిస్తామని ప్రశ్నించారు. బిజెపికి అధిక మొత్తంలో నిధులు ఎలా వస్తున్నాయని ప్రశ్నించారు. మౌలిక వసతులతో కూడిన క్షేత్ర ప్రజా వైద్య విధాన వ్యవస్థ వల్లే చైనా, క్యూబా, వియత్నాం దేశాలు కోవిడ్-19ని సమర్థవంతంగా ఎదుర్కొ న్నాయని చెప్పారు. సిఎఎ, ఎన్ఆర్సి, ఎన్పిఆర్లకు వ్యతిరేకంగా ఆలస్యంగానైనా తెలంగాణ తీర్మానం చేసిందని హర్షించారు. రాజ్యాంగ వ్యతిరేక సిఎఎ, ఎన్ఆర్సి, ఎన్పిఆర్లను ప్రజలందరూ తిరస్కరిస్తున్నారని పేర్కొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos