న్యూఢిల్లీ : పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు గురువారం నాలుగో రోజుకి చేరుకున్నారు. బీహార్‌లోని ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్)పై చర్చను నిర్వహించాలని ప్రతిపక్షాలు గత నాలుగు రోజులుగా డిమాండ్ చేస్తున్నాయి.ప్లకార్డులు ప్రదర్శించంతో పాటు వెల్‌లోకి దూసుకువెళ్లి నినాదాలు చేపట్టారు. దీంతో స్పీకర్ ఓంబిర్లా సభను మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా వేశారు. రాజ్యసభ సైతం మధ్యాహ్నానికి వాయిదా పడింది.