సింధియాకు ‘స్వైన్ ప్లూ ’

భోపాల్ : కాంగ్రెస్ పార్టీ తిరుగుబాటు శాసనసభ్యుల బృందానికి నాయకత్వం వస్తున్న జోతిరాధ్య సింధ్యా స్వైన్ ప్లూతో బాధ పడుతున్నందునే తమతో మాట్లాడేందుకు విముఖుత చూపిస్తున్నారని పార్టీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ మంగళవారం ఇక్కడ వ్యాఖ్యా నించారు.‘ఎవరైతే మధ్యప్రదేశ్ ఓటర్ల తీర్పును ధిక్కరిస్తారో. వారికి ప్రజలు కచ్చితంగా బుద్ది చెబుతారు. నిజమైన కాంగ్రెస్ కార్య కర్తలు ఎప్పటికీ పార్టీలోనే ఉంటారు.మధ్య ప్రదేశ్లో పరిస్థితి ఇప్పుడు బాగానే ఉంది. సింథియాను కలిసేందుకు ప్రయత్నించాం. ఆయనకు స్వైన్ ప్లూ సోకినట్లు చెప్పారు. అందుకే మాతో మాట్లాడలేకపోతుర’ని ఎద్దేవా చేసారు. జ్యోతిరాదిత్యా సింధియా నాయకత్వంలో ఆరుగురు మంత్రులు సహా మొత్తం 17 మంది ఎమ్మెల్యేలు బెంగళూరు రాజానుకుంటె సమీపంలోని విలాస విడిదిలో బస చేసారు. వారిని సంప్రందించేందుకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు చేసిన ప్రయత్నాలు ఫలించ లేదు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos