ఆపరేషన్ సిందూర్‌పై స్పందనలు

ఆపరేషన్ సిందూర్‌పై స్పందనలు

ఢిల్లీ: పాకిస్తాన్, పీఓకేలోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై బుధవారం తెల్లవారుజామున ప్రారంభించిన ఆపరేషన్ సిందూర్‌పై అంతర్జాతీయంగా, దేశీయంగా పలువురి నుండి స్పందనలు వెల్లువెత్తుతున్నాయి. పాకిస్తాన్, పీఓకేలోని ఉగ్రవాద వనరులన్నింటినీ నిర్మూలించడానికి భారతదేశం యొక్క నిబద్ధత రాజీలేనిదిగా ఉండాలని, ఎల్లప్పుడూ అత్యున్నత జాతీయ ప్రయోజనాలకు కట్టుబడి ఉండాలని కాంగ్రెస్ పేర్కొంది.

భారత సైన్యానికి తమిళనాడు అండగా నిలుస్తుంది : సీఎం స్టాలిన్

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఎక్స్ లో పోస్ట్ చేస్తూ… ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశం మొత్తం ఐక్యంగా ఉంది. భారత సైన్యం యొక్క ధైర్యం మరియు పరాక్రమం పట్ల దేశం మొత్తం గర్విస్తోందని పేర్కొన్నారు.ఒక భారతీయ పౌరుడిగా, ముందుగా మన సాయుధ దళాలకు బలంగా అండగా నిలుస్తున్నాం. పాకిస్తాన్ & పీఓకేలోని ఉగ్రవాద శిబిరాలపై దాడులు మనల్ని గర్వపడేలా చేస్తున్నాయి. ఇది జాతీయ సంఘీభావం, ఐక్యతకు సమయం… మనమందరం ఒక్కటిగా నినదిద్దాం. – జై హింద్! – రేవంత్ రెడ్డి, తెలంగాణ సిఎం

తాజా సమాచారం

Latest Posts

Featured Videos