ఛాంగ్‌జౌ : పీవీ. సింధు దూకుడు కొనసాగిస్తోంది. చైనా ఓపెన్ ప్రిక్వార్టర్ ఫైనల్‌కు ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ చేరుకుంది. ఒలింపిక్‌లో స్వర్ణాన్ని గెలుచుకున్న లీ జురుయ్ (చైనా)పై 21-18, 21-12 తేడాతో విజయం సాధించింది. కేవలం 34 నిముషాల్లోనే మ్యాచ్‌ను ముగించడం ద్వారా సింధు సత్తా చాటింది. లీ 20వ ర్యాంకు షట్లర్ కాగా, ఆమెను ఓడించడానికి పెద్దగా శ్రమించాల్సిన అవసరం లేకుండా పోయింది. మరో వైపు పురుషుల విభాగంలో జరిగిన పోటీలో బీ. సాయి ప్రణీత్ థాయ్‌లాండ్ ఆటగాడు సుపన్యు అవిహింగ్‌సనన్‌ను ఓడించాడు. తద్వారా తర్వాతి రౌండ్‌లో ప్రవేశించాడు. మిక్స్‌డ్ డబుల్స్‌లో ప్రణవ్ జెర్రీ చోప్రా, ఎన్. సిక్కిరెడ్డిలు జర్మనీకి చెందిన మార్క్ లమ్స్‌పస్, ఇసెబెల్ హెట్రిక్‌ల చేతిలో ఓడిపోయారు.