‘సింహా’ నిర్మాత అర్ధనగ్న నిరసన..

  • In Film
  • September 18, 2019
  • 159 Views
‘సింహా’ నిర్మాత అర్ధనగ్న నిరసన..

పదేళ్ల క్రితం విడుదలైన బాలయ్య నటించిన సింహా చిత్రం నిర్మాత పరుచూరి శివ రామప్రసాద్ జీహెచ్‌ఎంసీ అధికారుల తీరుకు నినసనగా రోడ్డుపై అర్ధనగ్న ప్రదర్శన చేశారు. హైదరాబాద్ షేక్ పేట ఓయూ కాలనీలో సినీ నిర్మాత పరుచూరి శివరామప్రసాద్నివసిస్తున్నారు. ఆయన ఉంటున్న వీధిలో వర్షం కురిసిన సమయంలో మోకాలి లోతు నీరు నిలువ ఉంటోంది. విషయాలను ఆధికారుల దృష్టికి తీసుకెళ్లగా అధికారులు సీసీ రోడ్డు నిర్మాణానికి రూ.3 లక్షలు మంజూరు చేశారునెల క్రితం కంకర తీసుకొచ్చి వీధిలో కుప్పగా పోశారు. ఆనాటి ఈనాటి దాకా పనులు మాత్రం చేపట్టలేదు. సోమవారం రాత్రి కంకరకుప్పల కారణంగా ప్రసాద్కిందపడి గాయపడ్డారు. దీంతో సోమవారం రాత్రి నుంచి అక్కడే బైఠాయించి నిరసన దీక్ష చేపట్టారు. రోడ్డు పనులు చేపట్టే వరకు కదిలేది లేదని అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. అధికారులు స్పందించి మంగళవారం మధ్యాహ్నం పనులకు శ్రీకారం చుట్టడంతో ఆయన దీక్ష విరమించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos