మోదీ హయాంలో పెట్రో ధరల పెంపు

మోదీ హయాంలో పెట్రో ధరల పెంపు

బెంగళూరు: రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయని బీజేపీ, జేడీఎస్ గగ్గోలు పెడుతున్నాయని, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారు నిరసన చేపట్టారని కర్నాటక సీఎం సిద్ధరామయ్య పేర్కొన్నారు. వారు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టడం తగదని, పెట్రో భారాలు మోపిన కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించాలని హితవు పలికారు. నరేంద్ర మోదీ ప్రధాని కాగానే పెట్రోల్ ధరలను లీటర్కు రూ. 72 నుంచి రూ. 104కు పెంచారని, డీజిల్ ధరలను రూ. 58 నుంచి రూ. 92కు పెంచారని పేర్కొన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గినప్పుడు కూడా మోదీ ప్రభుత్వం పెట్రో ధరలను పెంచి ప్రజలపై భారాలు మోపిందని దుయ్యబట్టారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos