చండీగఢ్ : కశ్మీర్ అంశంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన, దివంగత ఇందిరా గాంధీపై అభ్యంతకర వ్యంగ్య చిత్రాన్ని సామాజిక మాధ్యమాల్లోకి ఎక్కించిన ఇద్దరు సలహాదారులు- మాల్విందర్ సింగ్ మాలి, డాక్టర్ పైరీ లాల్ జార్జ్ కు పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ సమితి అధినేత నవజ్యోత్ సింగ్ సిద్దూ సోమవారం సంజాయిషీ తాఖీదుల్ని జారీ చేశారు. పాటియాలా నివాసానికి ఇద్దరినీ సోమవారం పిలిపించుకుని క్రమశిక్షణా చర్యల్ని చేపట్టారు. అనంతరం విలేఖరులతో మాట్లాడిన ఇద్దరు సలహాదారులు సంజా యిషీ మినహా ఇతర అంశాలను ప్రస్తావించారు. పంజాబ్ అభివృద్ధిపై సిద్దూతో చర్చించినట్లు చెప్పారు. వారు కశ్మీర్ ను ప్రత్యేక దేశంగా వ్యాఖ్యానించారు. ఇందిరా గాంధీ తుపాకీ పట్టుకున్న ఉన్న ఒక స్కెచ్ని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. వీటిపై ప్రతిపక్ష పార్టీల నుంచే కాకుండా సొంత పార్టీ నుంచే తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ముఖ్య మంత్రి కెప్టెన్ అమరీందర్ సింద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అవాగా హనారాహిత్యంతో ఏది పడితే అది మాట్లాడవద్దని హెచ్చరించారు. విమ ర్శలు తీవ్రం కావడంతో దిద్దుబాటు చర్యలకు దిగారు.