న్యూ ఢిల్లీ : విలువల గురించి పోరాడేటపుడు సహజంగానే ప్రత్యర్థి వర్గం స్వచ్ఛందంగా మద్దతిస్తుందని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత కపిల్ సిబాల్ వ్యాఖ్యానించారు. ‘జీవితంలో, రాజకీయంలో, న్యాయంలో, సామాజిక ఉద్యమాల్లో, సామాజిక మాధ్యమాల్లో , ఇలా ప్రతి రంగంలోనూ విలువల కోసం పోరాడే క్రమంలో సహజంగానే ప్రతి పక్షాల మద్దతు లభిస్తుంది. మేనేజ్ కూడా చేస్తార’ని ట్విట్టర్లో కపిల్ సిబల్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో నూతన నాయకత్వంతో పాటు క్రియాశీలమైన నాయకత్వం కావాలని కపిల్ సిబాల్తో బాటు ఇరవై మూడు మంది సీనియర్లు లేఖ రాసిన విషయం తెలిసిందే. దీన్ని విషయాన్ని రాహుల్ సీడబ్ల్యూసీలో ప్రస్తావించారు. ‘వారందరూ బీజేపీ కోవర్టులు’’ అంటూ తీవ్రంగా మండి పడ్డారు.