హైదరాబాదు: బెట్టింగ్ యాప్ వ్యవహారంలో యాంకర్ శ్యామల తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. బెట్టింగ్ కేసులో తన మీద నమోదైన ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయాలని శ్యామల తన పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే, ఆ పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసినందుకు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో శ్యామలపై కేసు నమోదైంది. ఆంధ్ర 365 అనే ఆన్ లైన్ గేమింగ్ యాప్ కు యాంకర్ శ్యామల ప్రమోషన్ చేశారు. సామాజిక మాధ్యమాల్లో ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌లకు ప్రచారం చేసిన కేసులో టీవీ యాంకర్ విష్ణుప్రియ, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ రీతూచౌదరిలను పంజాగుట్ట పోలీసులు నిన్న సుదీర్ఘంగా విచారించిన విషయం తెలిసిందే.