భారత షట్లర్లకు కఠినమైన డ్రా

భారత షట్లర్లకు కఠినమైన డ్రా

వచ్చే నెల 6న ప్రారంభం కానున్న ఆల్‌ ఇంగ్లాండ్‌ బ్యాడ్మింటన్‌
ఛాంపియన్‌షిప్‌లో భారత షట్లర్లు ఆరంభంలోనే సీడెడ్‌ ఆటగాళ్లను ఎదుర్కోవాల్సి వస్తోంది.
మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో అయిదో సీడ్‌ సింధు కొరియాకు చెందిన సుంగ్‌ హ్యూన్‌తో
తలపడనుంది. స్కాట్లాండ్‌కు చెందిన క్రిస్టీ గిల్మూర్‌తో ఎనిమిదో సీడ్‌ సైనా తలపడబోతోంది.
క్వార్టర్‌ ఫైనల్‌లో సైనా డిఫెండింగ్‌ ఛాంపియన్‌, టాప్‌ సీడ్‌ తై జుయింగ్‌ను ఢీ కొనబోతోంది.
పురుషుల సింగిల్స్‌లో ఏడో సీడ్‌ కిదాంబి శ్రీకాంత్‌ ఫ్రాన్స్‌కు చెందిన బ్రైస్‌ లెవెర్‌దెజ్‌తో
తలపడనున్నాడు. రెండో రౌండ్‌లో ఇండోనేషియాకు చెందిన జోనాథన్‌ క్రిస్టీ ఎదురు కావచ్చు.
శ్రీకాంత్‌ క్వార్టర్స్‌ దాకా వస్తే జపాన్‌కు చెందిన టాప్‌ సీడ్‌ మొమొటను ఎదుర్కోవాల్సి
ఉంటుంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos