గబ్బర్‌సింగ్‌ చిత్రం ఎప్పటికీ స్పెషలే..

  • In Film
  • January 4, 2020
  • 179 Views
గబ్బర్‌సింగ్‌ చిత్రం ఎప్పటికీ స్పెషలే..

గబ్బర్‌సింగ్‌ చిత్రంతో అప్పటివరకు తనపై ఉన్న ఐరన్‌లెగ్‌ ముద్రను చెరిపేసుకొని వరుస విజయాలతో దక్షిణాదిలో క్రేజీ హీరోయిన్‌గా మారిన శృతిహాసన్‌ ప్రేమలో బ్రేకప్‌ అయ్యాక మళ్లీ చిత్రాల్లో నటించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇటీవల రవితేజగోపీచంద్ మలినేని సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, “తెలుగులో నాకు మంచి హిట్స్ పడ్డాయి. జాబితాలోశ్రీమంతుడు‘ .. ‘రేసుగుర్రం‘ .. ‘బలుపువంటి చిత్రాలు ఉన్నప్పటికీ, ‘గబ్బర్ సింగ్స్థానం ప్రత్యేకం. తెలుగు హీరోల్లో మహేశ్ బాబు హ్యాండ్సమ్ .. పవన్ కల్యాణ్ స్టైలీష్ పర్సన్ .. బన్నీకి అంకితభావం ఎక్కువ .. ఆకర్షణీయమైన హైట్ ప్రభాస్ సొంతం అని చెప్పుకొచ్చింది. చిన్ననాటి క్రష్ ఎవరంటే మాత్రం హాలీవుడ్ హీరోలియనార్డో డికాప్రియోగా చెప్పింది.ప్రేమ కోసం ఎప్పుడూ పోరాడటానికి సిద్ధంగా ఉంటానన్న శృతి.. ప్రేమను నిర్వచించమంటే మాత్రం.. నడిపించే శక్తి అని తేల్చేసింది. సౌత్ ఇండియన్ వంటకాలంటే ఇష్టమే కాదు.. వాటిని చక్కగా వండేస్తానని చెప్పింది. అంతేకాదు.. ఇంట్లో ఇష్టమైన ప్లేస్ ఏదంటే.. కిచెన్ అని చెప్పి ఆశ్చర్యానికి గురి చేసింది.అంతలోనే.. వాస్తవానికి బాత్రూం అంటే ఇష్టమన్న ఆమె.. అక్కడే తనకు చాలా ఆలోచనలు వస్తాయని చెప్పిది. మీలో మీరు కోరుకునే మార్పు అంటే మాత్రం.. సహనాన్ని మరింత పెంచుకోవాలని చెప్పింది. కలలో ఎవరినైనా హగ్ చేసుకోవాల్సి వస్తే.. తాతయ్యను హగ్ చేసుకుంటానని తెలిపింది.ఇన్ని చెప్పిన శృతి తన గురించి మాత్రం చెప్పేందుకు పెద్దగా ఇష్టాన్ని ప్రదర్శించలేదు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos