రామ్‌చరణ్ నిర్మాతగా స్టైలిష్ దర్శకుడు సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో అత్యంత భారీ వ్యయంతో, ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సైరా నరసింహారెడ్డి చిత్రం చిత్రీకరణ దాదాపుగా పూర్తి కావచ్చింది.సైరా చిత్రీకరణ ముగిసిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో నటించడానికి సిద్ధమవుతున్నారు.ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రంలో ఒక కీలకమైన పాత్ర కోసం శృతి హాసన్ పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం.సినిమాలో ఈ పాత్ర ఎంతో కీలకమని అందుకు ఈ పాత్రను ఎవరైనా స్టార్ హీరోయిన్ చేస్తే మరింత రిచ్‌లుక్ వస్తుందని భావించి దర్శకుడు కొరటాల శివ పాత్ర కోసం శృతిహాసన్‌ను తీసుకోవడానికి నిర్ణయించుకున్నట్లు సమాచారం.ఈ పాత్ర సినిమాలో కీలకమైన పాత్రే కాని హీరోయిన్ తరహా పాత్ర కాదని సమాచారం.కానీ కొద్ది కాలంగా సినిమాలకు ముఖ్యంగా తెలుగు సినిమాలకు దూరంగా ఉంటున్న శృతిహాసన్ ఈ చిత్రాన్ని అంగీకరిస్తుందా అనేదే ప్రశ్న.కాగా ఈ ఆఫర్ కు శృతి ఓకే చెప్పే అవకాశాలు ఉన్నాయని టాక్.శృతి ఒప్పుకుంటే మాత్రం ఈ సినిమా తనకు టాలీవుడ్ లో కమ్ బ్యాక్ మూవీ అవుతుంది.త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.